ఓబిసి మోర్చా మండల కన్వీనర్ గా గంగోని రాము

నవతెలంగాణ- నవీపేట్: ఓబీసీ మోర్చా మండల కన్వీనర్ గా గంగోని రామును బుధవారం పండరీపూర్ ఎమ్మెల్యే సమాధాన్ మహాదేవ్ ఔతాడే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, మేడిపాటి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఓ బి సి కన్వీనర్ గా ఎన్నుకోవడం పట్ల మండల అధ్యక్షులు సరిన్ మరియు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు.