నాగపూర్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోపాల్ పెట్ సినిమా షూటింగ్ సందడి

నవతెలంగాణ – బాల్కొండ 
బాల్కొండ  మండలంలోనీ నాగపూర్ లో బుధవారం గ్యాంగ్ ఆఫ్ గోపాల్ పేట్ అనే చిత్రం షూటింగ్  నిర్వహించారు. రీల్ రియల్ మూవీ క్రియేషన్ చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ నేపథ్యంతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించామని దర్శక నిర్మాతలు మధు మల్లంవైవి, శ్రీఫణీంద్ర, మనీష్ రెడ్డిలు తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ తెలంగాణ గేయ రచయిత కోదారి శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహిస్తున్నరనీ. చిత్ర దర్శకులు మధు మల్లం వైవి తెలిపారు. నూతన నటీనటులతో గ్రామీణ నేపథ్యంలో  యువతకు స్ఫూర్తిగా నిలిచే  కథతో కూడిన సన్నివేవేషాలు ఉంటాయని దర్శకులు  తెలిపారు.హీరో నరేష్, హీరోయిన్ లలిత పై బావ మరదళ్ల నేపథ్యంతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించారు. నాగపూర్ గ్రామం  పాడిపంటలతో కూడిన పల్లెదనం ఉట్టిపడేలా ఉందని కథకు అనుకూలంగా లొకేషన్స్ ఉన్నాయని దర్శకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసెయిట్ డైరక్టర్ సంఘీర్ నాగపూర్ మాజీ ఎంపిటిసి ఈపి నారాయణ,నాయకులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.