శంషాబాద్‌లో గాంజా స్మోకర్స్‌ హల్చల్‌

శంషాబాద్‌లో గాంజా స్మోకర్స్‌ హల్చల్‌– ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ-శంషాబాద్‌
శంషాబాద్‌ సిద్ధాంతిలో చిన్నా రి పై లైంగిక దాడి ఘటన మరవక ముందే తాజాగా మరో ఘటన శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పో లీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపుతున్నది తాజాగా గం జాయి స్మోకింగ్‌ చేస్తూ యువకులు బస్తీలో హల్చల్‌ చేసి న ఘటన మంగళవారం శంషాబాద్‌లోని సిద్ధాంతి గ్రా మంలో జరిగింది. శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం..సిద్ధాంతి గ్రామంలోని ఓ ఇంట్లో యువకులు గంజాయి సేవిస్తున్నారన్న పక్కా సమాచా రంతో పోలీసులు దాడులు చేశారు. అక్షరు అనే ఓ యువకుడు గాంజా మత్తు లో స్థానికులపై చిందులు వేసినట్లు తెలుస్తున్నది. వీరి వద్ద నుంచి కొద్ది మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకొ ని నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గాంజా మత్తులో ఉన్న యువకులు ఎవరి పైనన్న దాడులు చేస్తారనే భయంతో స్థానికులు ఆందోళ న చెందుతున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.