నవతెలంగాణ – వేములవాడ : వేములవాడ పట్టణానికి చెందిన గంజి జైపాల్ రెడ్డినీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం చేశారు, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ నియామకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపు కోసం సహాయ శక్తులకు కృషి చేస్తానని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, పాత సతి లక్ష్మి, కనికరపు రాకేష్, నాగుల రామ గౌడ్, అడగట్ల అనిత, సూగురి సుధాకర్, గుర్రం తిరుపతి, తోట లహరి, బుజ్జభారతి, ప్రసాద్ కృష్ణ ప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు.