
నవతెలంగాణ – వేములవాడ
కాంగ్రెస్ ప్రజల అభివృద్ధి చేసే, సంక్షేమ కోరుకునే ప్రభుత్వం అని జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి అన్నారు.. గురువారం వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి ,మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫ్లెక్సీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, మిఠాయిలు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 16 కులాల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వమని కొనియాడారు. ఎన్నో సంవత్సరాలుగా రెడ్డి కార్పొరేషన్ కోసం గత ప్రభుత్వానికి విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు, పోరాటాల ప్రతిఫలమే కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిందని అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, బారాజు రమణారెడ్డి, నేరేడ్ల రాఘవరెడ్డి, సంజీవరెడ్డి, మల్లారెడ్డి ,రాజిరెడ్డి, నాగిరెడ్డి, మల్లారెడ్డి, రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.