మురికి కాలువలో చెత్త తొలగింపు

Garbage disposal in sewerనవతెలంగాణ – కమ్మర్ పల్లి 

మండల కేంద్రంలోని కాలనీలో  పలు చోట్ల మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది మంగళవారం తొలగించారు. మురికి కాలువలోని చెత్తాచెదారాన్ని ఎత్తి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించారు. కాగా 63వ నంబర్ జాతీయ రహదారి పక్కనే కళ్యాణి ఫోటో స్టూడియో సమీపంలో ఉన్న మురికి కాలువలో చెత్త తొలగింపు పంచాయతీ కార్మికులకు ఇబ్బందికరంగా మారుతుంది. ఇక్కడ రెండు వైపుల నుండి మురికి నీరు ఒక చోట చేరి అక్కడినుండి  జాతీయ రహదారి కింద ప్రవహిస్తుంది. అయితే మురికి కాలువల్లో ప్రజలు వేసే ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ బాటిల్లు, ఇతరత్రా వస్తువులు మురికి నీటి ప్రవాహంలో కొట్టుకు వచ్చి కళ్యాణి ఫోటో స్టూడియో సమీపంలో ఉన్న మురికి కాలువల వద్ద పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోతున్న చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగిస్తున్న ప్రజలు నిత్యం మురికి కాలువల్లో వేసే చెత్త మూలంగా ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రజలు చెత్తాచెదారాన్ని మురికి కాలువల్లో కాకుండా ఇంట్లోనే నిల్వ ఉంచుకొని గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేస్తే బాగుంటుందని పంచాయతీ సిబ్బంది పేర్కొంటున్నారు.