– పాకిస్థాన్ వైట్‌బాల్ కోచ్‌గా రాజీనామా
కరాచీ : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ తెగతెంపులు చేసుకున్నాడు. పాకిస్థాన్ జట్టుకు టీ20, వన్డే కోచ్‌గా ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్యారీ కిర్‌స్టన్ నిమిమతులయ్యారు. ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌తో పాకిస్థాన్ కోచ్‌గా కిర్‌స్టన్ ప్రయాణం మొదలైంది. ఆ టోర్నీలో పాకిస్థాన్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. పదేపదే కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్లను తరచుగా మార్చటంపై పీసీబీతో కిర్‌స్టన్‌కు విభేదాలు వచ్చినట్టు సమాచారం. 50 ఓవర్ల ఫార్మాట్‌లో విశేషంగా విజయవంతమైన కిర్‌స్టన్.. పాకిస్థాన్ వైట్‌బాల్ కోచ్‌గా ఒక్క వన్డే మ్యాచ్‌కు సైతం బాధ్యతలు నిర్వర్తించకుండానే పదవి నుంచి తప్పుకున్నాడు. కిర్‌స్టన్ రాజీనామాతో రానున్న ఆస్ట్రేలియా పర్యటనకు టెస్టు జట్టు కోచ్ జేసన్ గిలెస్పీకి కోచ్ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పీసీబీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. గ్యారీ కిర్‌స్టన్ కోచ్‌గా భారత్ 2011 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు సైతం కిర్‌స్టన్ కోచ్‌గా పని చేశారు.