గ్యాస్‌ వినియోగదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి

– హెచ్‌ పీగ్యాస్‌ డీలర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి
నవతెలంగాణ-దోమ
గ్యాస్‌ వినియోగదారులు ఈ కేవైసీనీ తప్పనిసరిగా చేయించుకోవాలని హెచ్‌.పి గ్యాస్‌ డీలర్‌ విష్ణు వర్ధన్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఈ కేవైసీనీ చేసుకోని గ్యాస్‌ వినియోగదారులు ఇంకెవరైనా మిగిలి ఉంటే ఈ నెల 31వ తేది వరకు అవకాశం ఉన్నదని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని మండల గ్యాస్‌ వినియోదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.