నీటి సంఘాల అభిప్రాయాలు సేకరణ 

Gathering views of water communitiesనవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజంసాగర్ ప్రాజెక్టు వద్ద డైరెక్టర్ జనరల్ చీఫ్ ఇంజనీర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అధికారి రాజా మంగళవారం నీటి సంఘాల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ ప్రాజెక్టులోని నీటి సామర్థ్యం బట్టి ఆ నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశంపై రైతులతో తో చర్చించి అభిప్రాయాలను ఆయన సేకరించారు. కార్యక్రమంలో వాటర్ రిసోర్సెస్ బోర్డ్ మెంబర్స్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోలమన్, ఏ ఈ ఈ శివ తదితరులు పాల్గొన్నారు.