క్రికెట్ సెలెక్షన్‌ కమిటీపై గౌతమ్ గంభీర్ ఫైర్

నవతెలంగాణ న్యూఢిల్లీ: క్రికెట్ సెలెక్షన్‌ కమిటీపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ విరుచుపడ్డాడు. ఇదోక చెత్త కమిటీగా పేర్కొన్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త కమిటీ అని గంభీర్‌ విమర్శించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసినప్పుడు సెలెక్షన్‌ కమిటీ పెద్ద ఎత్తున విమర్శలను మూటకట్టుకుందని తెలిపారు. నాలుగో స్థానానికి అనుభజ్ఞుడైన అంబటి రాయుడు బదులు విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడం దుమారం రేపింది.
‘‘భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త సెలెక్షన్‌ కమిటీ అది. అంబటి రాయుడు వంటి బ్యాటర్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడిని ప్రపంచకప్‌కు తీసుకెళ్లకుండా మరొకరికి అవకాశం ఇచ్చారు. నాలుగో స్థానమే అతిపెద్ద సమస్యగా ఉన్నప్పటికీ ఇలా చేశారు. అంబటి రాయుడును ఏడాదంతా ఆడించారు. కాని ప్రపంచకప్‌కు ముందు తప్పించారు. అందుకు కారణమేంటో ఎవరికీ తెలియదు’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.