రేషన్ షాపుల్లో పంపిణీ చేసే ఉచిత బియ్యంలో సగం గయాప్

– ప్రతి నెల ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో కేంద్ర వాటా ఎంత, రాష్ట్ర వాటా ఎంత
– మోడీ బియ్యం 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వ బియ్యం 6 కిలోలు మొత్తం 11 కిలోల బియ్యం పంపిణీ జరగాలి
– దాదాపు ఒకటిన్నర సంవత్సరాల కాలంగా ఉచిత బియ్యం అందించేది ఆరు కిలోలు మాత్రమే
– మరో ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీలో లోపాలు ఎందుకు
– కేంద్ర బియ్యం అంటారు, రాష్ట్ర బియ్యమంటారు, ఇచ్చేది ఆరు కిలోలు, చెప్పేది 11 కిలోలు
– సగం బియ్యం గయాప్ తో అయోమయంలో రేషన్ లబ్ధిదారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించని ప్రజలు
– మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ఓట్ల కోసం వస్తున్నారు..
– సగం బియ్యం అందని వాటి గురించి ఏ ఒక్కరు పట్టించుకోరు, రేషన్ బియ్యం లబ్ధిదారుల్లో జోరుగా వినిపిస్తున్న చర్చలు
– కేంద్ర బియ్యం ఎంత రాష్ట్ర బియ్యం ఎంత పంపిణీ జరుగుతుందని జిల్లా అధికారులకు ప్రశ్నిస్తే, సమాధానం ఇవ్వలేకపోతున్న జిల్లా అధికారులు
నవతెలంగాణ – మద్నూర్
కేంద్రంలో గల మోడీ సర్కార్ ప్రతి నెల 5 కిలోల చొప్పున ప్రతి వ్యక్తికి ఉచిత బియ్యం రేషన్ షాపుల ద్వారా అందించడం జరుగుతుందని చెప్తున్నారు. కేంద్ర బియ్యం 5 కిలోలు రాష్ట్రం ఇచ్చే 6 కిలోలు ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా ఈ లెక్కన పంపిణీ జరగడంలేదని రేషన్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుపుతోంది. కేంద్రం ఇచ్చే 5 కిలోలు, రాష్ట్రం ఇచ్చే 6 కిలోలు, మొత్తం ప్రతినెల 11 కిలోల చొప్పున ప్రతి వ్యక్తికి బియ్యం పంపిణీ జరగాలి. అలాంటి పంపిణీ మద్నూర్ మండలంలో రేషన్ షాపుల్లో జరగడం లేదని, ప్రతినెల 6 కిలోలు మాత్రమే పంపిణీ జరుగుతున్నట్లు, మిగిలిన 5 కిలోలు పంపిణీ జరగడం లేక, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించలేక ఉచిత బియ్యం కదా ఇచ్చినంత తీసుకుందాం అనే లెక్కన రేషన్ లబ్ధిదారులు గయాప్ అయ్యే బియ్యం గురించి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేని పరిస్థితి ప్రతినెలా రేషన్ బియ్యం పంపిణీలో భారీ మొత్తంలో బియ్యం పంపిణీ జరగడం లేదని ఆవేదన లబ్ధిదారుల్లో వ్యక్తం అవుతుంది. మద్నూర్ ఉమ్మడి మండలంలో మొత్తం 33 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో అర్హులైన రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 14, 966 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల లెక్కన రాష్ట్ర ప్రభుత్వం అందించే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున గల జనాభా సంఖ్య 52,295 మంది ఉన్నారు. అర్హులైన బియ్యం పొందే జనాభా సంఖ్య ప్రకారం ప్రతి నెల 6 కిలోల చొప్పున లెక్కేస్తే మద్నూర్ ఉమ్మడి మండలానికి ప్రతి నెల3,13,770 కిలోల బియ్యం పంపిణీ జరుగుతున్నట్లు అధికారులు అంచనాలను బట్టి తెలుస్తోంది. 6 కిలోలు పైన తెలిపిన లెక్కల ప్రకారం అయితే ఇక కేంద్రం ఇచ్చి ఐదు కిలోలు లెక్కిస్తే ప్రతి నెల మరో2,61,475 కిలోల బియ్యం అధనంగా పంపిణీ జరగవలసి ఉండగా, ఈ బియ్యం పంపిణీ జరగడం లేక గయాప్ అవుతున్నాయని ఆరోపణలు లబ్ధిదారుల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రతినెలా పంపిణీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల బియ్యం పంపిణీ జరగడం లేదు. ఎందుకంటే ఆరు కిలోల చొప్పున ఇస్తున్న బియ్యం  రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవిగా ప్రజలు భావిస్తున్నారు. కేంద్రం మోడీ సర్కారీ ఇచ్చే బియ్యం అందడం లేదని చర్చలు వినబడుతున్నాయి. బియ్యం పంపిణీలో ఐదు కిలోల బియ్యం అందించలేక సరఫరా చేస్తున్న బియ్యం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల కాలంగా ఆరు కిలోలే పంపిణీ జరగడం, మరో ఐదు కిలోలు బియ్యం అందించలేకపోవడం ప్రతి నెల లక్షల కిలోల బియ్యం లబ్ధిదారులకు పంపిణీ జరగడం లేక గయాప్ అవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో బియ్యం పంపిణీ జరగకపోవడం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోతుందంటే రేషన్ షాపుల ద్వారా పంపిణీ జరిగే బియ్యం ఎవరివి అనేది రేషన్ లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంటుంది. బియ్యం పంపిణీ ఇచ్చేది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆరు కిలోల బియ్యం లో కేంద్రం వాటా రాష్ట్ర వాటా ఉన్నట్లా ఉన్నట్లయితే, మిగిలిన బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి. పంపిణీ జరగని బియ్యం వాటాలో కేంద్రం రాష్ట్రం సముజిగా చూసుకుంటున్నాయా, అనే చర్చలు జోరుగా వినబడుతున్నాయి. రేషన్ షాపుల ద్వారా పంపిణీ జరిగే ఉచిత బియ్యంలో పెద్ద మొత్తంలో గోల్మాల్ అవుతున్నాయని ఆరోపణలు లబ్ధిదారుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఆరు కిలోలు ఇస్తున్నట్లు చెప్పుకుంటుంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పంపిణీ చేసే బియ్యం ఎవరు తగ్గిస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రతి నెల లబ్ధిదారులు 5 కిలోలు మోసపోవాల్సి వస్తుంది. ఇకనైనా రేషన్ షాపుల ద్వారా జరిగే ఉచిత బియ్యం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన విచారణ జరిపి పంపిణీ, బియ్యం రాష్ట్ర ప్రభుత్వానియా, లేక కేంద్ర ప్రభుత్వాన్నియ గయాప్ అయ్యే బియ్యం లబ్ధిదారులు మోసపోకుండా పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని రేషన్ లబ్ధిదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నారు.