– బైడెన్, హారిస్‌లకు యుఎస్ వైద్య బృందం లేఖ
గాజా పిల్లలను ఇజ్రాయిల్ దళాలు ‘ఉద్దేశపూర్వకంగా’ కాల్చిచంపాయని అమెరికాకు చెందిన వైద్య బందం బైడెన్, హారిస్‌లకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ మేరకు ఫిరోజ్ సిద్వా ఎక్స్ లో సదరు లేఖను పోస్టు చేశారు. ఇజ్రాయిల్‌కు దౌత్య, సైనిక మద్దతును అమెరికా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అక్టోబరు నుండి గాజాలో వైద్య సేవలందిస్తున్న 45 మంది అమెరికన్ వైద్యులు, నర్సుల బృందం ఇజ్రాయిల్ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మాలో ప్రతి ఒక్కరూ ప్రతి రోజు తలపై, ఛాతీలపై కాల్చబడిన పిల్లలు, యువకులకు చికిత్స చేశాం. మహిళలు, పిల్లలపై భరించలేని క్రూరత్వ దృశ్యాలను స్వయంగా చూశాం. వాటిని మరచిపోలేం.” అని లేఖలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు.