
జిల్లాలో 2023- 2025 సంవత్సరానికి 82 మద్యం దుకాణాల కేటాయింపు కోసం ఎక్సైజ్ పాలసీ నోఫికేషన్ విడుదల చేశారు. శుక్రవారం భువనగిరిలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లా అధికారి నవీన్ కుమార్ సర్కిల్ అధికారులతో కలిసి శుక్రవారం నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఉన్న మొత్తం 82 మద్యం దుకాణాల్లో రాష్ట్ర ఎక్సైజ్ గెజిట్ ఆధారంగా 29 దుకాణాలను రిజర్వుడు కేటగిరికి కేటాయించినట్లు తెలిపారు. గౌడ కమ్యూనిటీకి 21, ఎస్సీలకు 7, ఎస్టీలకు 1, ఓపెన్ కేటగిరిలో 53 దుకాణాలు ఉన్నట్లు వివరించారు. రిజర్వుడు కేటగిరి ఎంపికను కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిని దుకాణాలను ఎంపిక చేశామని తెలిపారు. శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. భువనగిరి, ఆలేర్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో దుకాణాల దరఖాస్తులను. పట్టణంలోని తాతానగర్ లో ఉన్న భువననగిరి సర్కిల్ కార్యాలయంలో, రామన్నపేట, మోత్కూరు పరిదిలో ఉన్న వాటికి జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సమర్పించవచ్చుని తెలిపారు. ఒక్కొ దరఖాస్తుకు రుసం రూ. 2లక్షల డీడీతోపాటు, పాన్ కార్డు ధ్రువపత్రం సమర్పించాలన్నారు. కమ్యూనిటీ వారిగా కేటాయించిన దుకాణాలకు ఆయా కుల ధ్రువ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఈ నెల 18న సాయంత్రం 6గంటల వ ఉంటుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఈ నెల 21న సోమరాధాకృష్ణ ఫంక్షన్హాల్లో లాటరీ తీయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిఐలు నాగిరెడ్డి, నాగ లత, ఎస్సైలు పాల్గొన్నారు.