జన్నారం మండలంలోని ఫోన్ కాల్ గ్రామపంచాయతీ పరిధిలోని శివారులోని శ్రీ కేతేశ్వర స్వామి కాంకాలమ్మ దేవాలయంలో జీసీసీ రాష్ట్ర ఛైర్మన్ కొట్నాక తిరుపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో భాగంగా ఆదివారం ఆయన శ్రీ కేతేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.