– ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి పెరుగుదలకు అండగా నిలువనున్న అత్యాధునిక పరికరాలు
నవతెలంగాణ – మహారాష్ట్ర: న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయబడిన ఒక స్వతంత్ర సంస్థగా ప్రారంభమైన తర్వాత, జీఈ ఏరోస్పేస్ పుణెలో తన తయారీ కేంద్రాన్ని విస్తరించడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి 240 కోట్ల రూపాయల (USD 30 మిలియన్లు) పెట్టుబడిని ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు యంత్రాలు/ పరికరాలు, ప్రత్యేక సాధనాలను కొనుగోలు చేయడం ద్వారా కొత్త ప్రాజెక్టులు, తయారీ ప్రక్రియలను జోడించడానికి ఈ పెట్టుబడి ఈ తయారీ కేంద్రానికి వీలు కల్పిస్తుంది. “పుణెలోని మల్టీ-మోడల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఉన్న మా బృందం భద్రత, నాణ్యత, మా కస్టమర్ల కు డెలివరీ చేయడంపై పటిష్ఠ దృష్టిని కలిగి ఉంది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ విడిభాగాలకు సంబంధించి మా అంతర్జాతీయ సరఫరా చెయిన్ లో ఇప్పటికే బలమైన సహకారిగా మారిన ఈ సైట్‌లో విస్తరణను చూసి నే ను సంతోషిస్తున్నాను” అని జీఈ ఏరోస్పేస్‌లోని గ్లోబల్ సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ మైక్ కౌఫ్ మన్ అన్నారు.”ఈ పెట్టుబడి భారతదేశంలో ఏరోస్పేస్‌లో మా వృద్ధిని కొనసాగించడానికి మాకు సహాయపడుతుంది, మాకు వనరులను అందజేస్తుంది, పెరుగుతున్న కస్టమర్ల డిమాండ్‌ను మేము తీర్చవలసి ఉంటుంది” అని జీఈ ఏరోస్పేస్ పుణె ఫెసిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ అమోల్ నగర్ అన్నారు. 2015 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కర్మాగారం కమర్షియల్ జెట్ ఇంజన్లకు సంబంధించిన విడి భాగాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాణిజ్య జెట్ ఇంజిన్లు అయిన G90, GEnx, GE 9X మరియు జీఈ, సఫ్రాన్ జాయింట్ వెంచర్ అయిన CFM చే లీప్ ఇంజిన్లు అసెంబుల్ చేసేందుకు ఈ విడిభాగాలను జీఈ అంతర్జాతీయ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు. స్పెషలైజ్డ్ ఏరోస్పేస్ ప్రెసిషన్ తయారీ ప్రక్రియలలో ప్రారంభం నుండే 5000 మందికి పైగా శిక్షణ పొందిన స్థానిక ఏరోస్పేస్ తయారీ ప్రతిభావంతులను అభివృద్ధి చేయడంలో ఈ కేంద్రం కీలకంగా ఉంది. ISO14001 & ISO45001 కింద సర్టిఫికేట్ పొందిన ఈ కేంద్రం కమ్యూనిటీలో పర్యావరణ ఉత్తమ పద్ధ తులు మరియు సారథ్యాన్ని నిర్మించింది. ఉదాహరణకు, తన విద్యుత్ వినియోగంలో 30% పునరుత్పాదక వనరుల నుండి వస్తుంది, ఇది జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం 1 కోటి లీటర్ల నీటిని (100 మిలియన్ లీటర్లు) రీసైకిల్ చేస్తుంది, పునర్వినియోగిస్తుంది. 20 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేస్తుంది.