జీపీ కార్మికున్ని పరామర్శించిన గీరెడ్డి మహేందర్ రెడ్డి 

Geereddy Mahender Reddy visited the GP workerనవతెలంగాణ – రామారెడ్డి

మండలంలోని పోసానిపేట్ గ్రామపంచాయతీ కార్మికుడు సోమవారం గ్రామపంచాయతీ పైప్ లైన్ మరమ్మత్తు చేస్తూ గుంటలో పడటంతో, ఎవరు చూడకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు టెలిఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించటంతో, అపస్మారక స్థితిలో ఉండటంతో కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం మాజీ సర్పంచ్ గి రెడ్డి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఓబీసీ ఉపధ్యక్షులు పల్లె ప్రశాంత్, గ్రామపంచాయతీ సిబ్బంది హైదరాబాదులో ఆయనను పరామర్శించారు. మహేందర్ రెడ్డి డిపిఓ తో పాటు ఎంపీడీవో తిరుపతిరెడ్డికి సమాచారం అందించి, బాధితున్ని ఆదుకోవాలని సూచించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపినట్లు ఆయన తెలిపారు.