గీతా కార్మికులు హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా 

Geetha workers will put pressure on the government to implement the promises– కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొమురయ్య 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని  కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొమురయ్య అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు.  జిల్లా అధ్యక్షులు కోహెడ కొమురయ్య సమక్షంలో మండల పట్టణ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోయడ  కొమురయ్య మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన గీతా కార్మికుల ప్రధాన డిమాండ్లు సేఫ్టీమోకులు, మోటారు బైకులు, గుర్తింపు కార్డులు , ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయల పెంపు, తాళ్లు ఎక్కుతూ రిటైర్మెంట్ అయిన వారికి ఐదు లక్షల రూపాయలు. బెల్ట్ షాపులు బంద్, భూమిలేని గ్రామాలలో ఐదు ఎకరాల భూమి కేటాయించాలనే భీమండను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎల్లమ్మ గుడి చైర్మన్ పూదరి లక్ష్మినారాయణ గౌడ్, ఇల్లందుల పరిశయ్య, పూదరి రామస్వామి, పాకాల సమ్మయ్య గౌడ్, బుర్ర లింగయ్య గౌడ్,   పూదరి హరీష్, పూదరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.