ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా గీత నామినేషన్

నవతెలంగాణ – అచ్చంపేట 
నాగర్ కర్నూల్ లోక్ సభ ఎన్నికలలో ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా అచ్చంపేటకు చెందిన గాలిముడి గీత గురువారం నామినేషన్ దాఖలు చేశారు. యువతి యువకులు రాజకీయాల్లోకి రావాలని,  మన ప్రాంతాన్ని మనమే పాలించాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. తనకు ఒకసారి అవకాశం ఇస్తే, నల్లమల్ల ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంటులో గళం వినిపిస్తానని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు నన్ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.