ప్రముఖ ధార్మిక సంస్థ అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి ఐదేళ్లు నూతన కార్యవర్గాన్ని గురు వారం రైల్వే స్టేషన్ రోడ్డు గీత భవనంలో ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు నరేంధర్ రావు తెలిపారు. అధ్యక్షుడు యం ఎస్ నర్సింహ చార్యులు ప్రధాన కార్యదర్శి మేడిచర్ల ప్రభాకర రావు ఉపాధ్యక్షుడు యోగ రామచంద్రం కోశాధికారి ఆరెట్టి లక్ష్మీనారాయణ ఉప కార్యదర్శులుగా జనగామ చంద్రశేఖర శర్మ , పి.గంగాధర్ బోధన్ కార్యదర్శిగా అశోక్ కులకర్ణి నిర్మల్ కార్యదర్శి గా వేంకట రమణ గవర్నింగ్ సభ్యులుగా బొడ్డు దయానంద్, షేర్ల దయనంద్ వెంకట స్వామి జిఎం శంకర్ అశోక్ శ్రీనివాస్ తదితరులను ఏక గ్రీవంగా ఎన్నికుని ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు నర్సింహ చారి మాట్లాడుతూ.. భగవద్గీతను విస్తృత ప్రచారం చేసి కళాశాల పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక వేసవి అవగాహన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయ వాధి ఎం ఎస్ శ్రీహరి వ్యవహరించారు. లోక కల్యాణం కోసం పుష్య పౌర్ణిమ గీత యజ్ఞం చేశారు.