గీత కార్మికునికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ-మోతె
తాటిచెట్టు పైనుండి కింద పడి గీత కార్మికునికి గాయాలైన సంఘటన ఆదివారం మండల పరిధిలోని రాఘవపురంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రాఘవపురం గ్రామానికి చెందిన బత్తిని కష్ణయ్య రోజువారి వత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడడంతో చేతులకు, కాళ్లకు, కడుపులో గాయా లయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు.