గీతం స్కాలర్‌ పుష్ప పీహెచ్‌డీ

నవతెలంగాణ-పటాన్‌చెరు
గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హైదరా బాద్‌లోని మేనేజ్మెంట్‌ విభాగం పరిశోధక విద్యార్థిని పుష్ప మాచానీని డాక్టరేట్‌ వరించింది. ‘పారిశ్రామికవేత్తల విజయం పై క్లిష్టమైన విజయ కారకాల ప్రభావం: తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రత్యేక అధ్యయనం’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పిం చారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లోని డాక్టర్‌ సి.నాగప్రియ, ప్రొఫెసర్‌ వె.లక్ష్మణ కుమార్ప్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకట నలో ఈ విషయాన్ని వెల్లడించారు. మేఘాలయలోని ఐఐఎం షిల్లాంగ్‌కు చెందిన ప్రొఫెసర్‌ నళినీ ప్రవ త్రిపాఠి బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు.పుష్ప పరిశోధన తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై నిర్దిష్ట దృష్టితో పారిశ్రామిక వేత్తల విజయాన్ని ప్రభావితం చేసే క్లిష్టమైన విజయ కారకాలను విశ్లేషించడం లక్ష్యంగా సాగిందన్నారు. ‘ప్రభుత్వ అంశం’, ‘సాంకేతిక అంశం’, ‘సామాజిక అంశాల’ వంటివి చిన్నతరహా సంస్థల పారిశ్రామికవేత్తలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ అధ్యయనం గుర్తించినట్టు పేర్కొన్నారు. సూక్ష్మ వ్యవస్థాపకులు ‘మేనేజ్‌ మెంట్‌ ఫ్యాక్టర్‌’, ‘మార్కె ట్‌-సంబంధిత అంశం’ పట్ల గణనీయమెన ఆకర్ష ణను కనబరిచినట్టు తెలిపారు. మధ్య తరహా వ్యవస్థాపకులు ‘ఆర్థిక కారకం’, ‘వ్యక్తిగత కారకం’ కోసం ప్రాధాన్యతను ప్రద ర్శించారన్నారు. పుష్ప సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించడం సట్ల గీతం విశ్వవిద్యా లయం, హైదరాబాద్‌ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్‌ డీ.ఎస్‌. రావు, గీతం రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, పలు విభాగాల అధిపతులు, అధ్యాసకులు, సిబ్బంది సలువురు ఈ సందర్భంగా ఆమెను అభినందించారు.