గుళిక రాళ్లతో రత్నాల పంట..

Gems crop with pellet stones..– పంట సాగుకు అనుకూలంగా మార్చుకున్న రైతులు.

– భారీగా దిగుబడి. 
– నీటీ సనస్య వలన రైతులకు ఇబ్బందులు.
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో రైతులు గుళిక రాళ్లలో పంటల సాగు చేస్తు రోల్ మాడల్ గా నిలుస్తున్నారు. రాళ్లు రప్పలలో పంట సాగు చేయడం రైతులు ఎన్నో కష్ట నష్టాలు భరించాల్సి వస్తుంది. అన్నింటిని తట్టుకుని దైర్యంగా పెట్టుబడి పెట్టి పంటసాగు చేయాలీ . నీరు లేకున్న , నీరు అధికమైన, నీటీ సౌకర్యం అంతంత మాత్రనే ఉన్న సమస్యలలో చిక్కుకొని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జుక్కల్ మండలంలో మెుత్తం సుమారుగా మప్పా తోమ్మిది వేల ఎకరాల వరకు పంట సాగుకు అనుకూలమైన భూములు ఉన్నాయి. అందులో నల్ల రేగడి, ఇసుక భూములు, ఎర్రటి జాజు కలర్ భూములు, బంక మట్టి భూములు,  రాళ్లురప్పలు కల్గిఉన్న  రకరకాలైన భూములు విస్తరించి ఉన్నాయి . ముఖ్యంగా గుళిక  రాళ్లు రప్పలలో  పంటలను రైతులు సాగు చేయడం సహోసపేతమైనదిగా చెప్పవచ్చు. మండలంలోని సోపూర్, మథురాతాండా, డోన్గాం తాండా,  డోన్గాం , వజ్రఖండి , మైలార్, శక్తీనగర్, విజయ్ నగర్, దోస్పల్లి, బంగారుపల్లి , గుండూర్, గుండూర్ తాండా, గుల్లా తాండా, పెద్ద గుల్లా, చిన్న గుల్లా, పడంపల్లి, నాగల్ గావ్, గ్రామాలలో సుమారుగా పది వేల ఎకరాల పై చిలుకు గుళ్ిక రాళ్లు కల్గిన వివిధ రకాల భూములు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా ఖరీప్ సీదన్ లోనేే వర్షాదారం పైన పంటల సాగు రైతులు ఎక్కువగా చేస్తారు. పర్వత ప్రాంతాలతో పాటు వాటి కింద కూడా ఈభూములు ఉన్నాయి. కొన్నింటికి నీటీ సౌకర్యం ఉంది. ఇంకొన్ని వాటికి నీటీ సౌకర్యాలు  లేదు. వర్షం నీరే పంటకు ఆధారం. రాళ్ల భూములలో ఎక్కువగా సోయా, పెసర, మినుము, కందులు, పత్తి , తో పాటు కూరగాయలు కూడా పండిస్తుంటారు. కొంత మంది రైతులు పర్వత ప్రాంతాలలో ఉన్న భూములకు పర్వతం కింది బాగంలో బోర్లు వేయించి హై కాంప్రేసర్ మేాటారు ద్వారా ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని నీటి వసతి కల్పించుకుని అద్బతమైన చెరుకు, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ పంటలను సాగు చేస్తు పురోగతి చెందుతున్నారు. వర్షం పైన అధార పడిన రైతులు నిత్యం వర్షం పడితే బాగుండేదని అనుకుంటారు.
పర్వతం పైన పంటలకు ఎంత వర్షం పడిన నష్టం చాలా తక్కువగా ఉంటుంది. రోదు తప్పించి రోజు వర్షం పడిన ఎటువంటి నష్టం ఉండదు. పంట సాగుకు పెట్టుబడి రైతులు  భారీగా ఖర్చు  పెట్టాల్సిందే , విత్తనాలు, మందులు, రసాయన మందులు, కలుపు నివారణకు కూలీల ఖర్చులు , ఇతర ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు రసాయన ఎరువు పిచకారీ చేయాలంటే నీరు అవసరం పర్వతం కింద నుండి నీరు తెవాల్సి ఉంటుంది , కాబట్టి కూలీ ఎక్కువగా చెల్లించాల్సిందే లేకుంటే పని జర్గదు తప్పని పరిస్థితిలో కూలీ ఖర్చులు భారీగానే చెల్లించాల్సిందే. గుళిక రాళ్లు ఉండటం వలన కట్టెతో తయారు చేసిన వ్వవసాయ పనిముడ్లు ఎక్కువగా రాళ్లు ఉండటంతో విరిగి పోతాయి, నాటి పూర్వీకుల కాలంలో కట్టే సమాన్లు మాత్రమే కల్గిఉండేవి , వాటిని సున్నితంగా వాడేవారు, ఏ కొంచేం పొరపాటు జర్గిన విరగి పోయేవి ,  ప్రస్తుతం ట్రాక్టర్, హర్వేస్టింగ్  యంత్రాలు అందుబాటులోకి ఉండటంతో డబ్బు ఖర్చు ఇయిన పర్వాలేదు పని తొందరగా పూర్తీ చేయవచ్చు అని రైతులు దీమాగా ఉంటారు. పంటల దిగుబడి ఇతర భూములలో పండించిన విధంగానే దిగుబడి రైతులు పొందుతారు. వర్షం ఎక్కునగా ఉంటే రాళ్ల భూములు పర్వతాల  కింది బాగంలో మంచి భూములకు కూడా దిగుబడిలో సైడ్ చేస్తాయి.రాళ్ల భూముల విలువ కూడా తక్కువగానే  అనూకుంగా ఉండటంతో రైతులు గట్టుభూములు కొనెందుకు అసక్తీ చూపుతుంటారు.
1) రైతు సాయులు డోన్గాం విలేజ్:- నాకు ఒక ఎకరం గుళిక రాళ్ల భూమి ఉంది. అందులో ఎక్కువగా పత్తి లేదా సోయా పంటను ప్రతి ఎడాదీ వర్షాదారం పైనే  సాగు చేస్తుంటాను. పంటకు సరిపడేే వర్షం పడితే పంట దిగుబడి ఎకరాకు ఎనమిది నుండి పది క్వింటాల్ పంట వస్తుంది. ఖర్చులు పోను సగం మిగులుతుందని రైతు తెలిపారు.
2) డోన్గాం తాండా , శీవాజీ రైతు :- నాకు పది ఎకరాల గుళిక రాళ్ల భూమీ ఉంది.పర్వతం కింద కొంత భూమీ ఉంది . అక్కడ బోరు బావీ ఉంది. అక్కడి నుండి నీటీని గట్టు మీదికి  పైప్ లైన్ ద్వారా నీరు పంపింగ్ చేసి వివిధ రకాల పంట సాగు చేస్తాను. పంటలు బాగానే పండుతాయి. వర్షాలు సమయంనకు పడక పోతే బోరు నీరు సహయంతో నీటిని వాడుకోవడం వలన సంవత్సరానికి మూడు పంటలు పండించి నంచి లాభాలు వస్తుంటాయి. ఒక్కొక్క ఎడు చీడపురుగులు, తెగుళ్ల బారీన పడి దిహుబడితో పాటు పెట్టు బడి కూడా రాకుండా ఉంటుందని రైతు తెలిపారు.