బ్యాంకు మేనేజర్ ను సన్మానించిన జనరల్ బాడీ సమావేశం 

General body meeting to honor the bank manager– మహిళా శక్తి కార్యక్రమాలను వినియోగించుకోవాలి కమ్యూనిటీ కోఆర్డినేటర్ 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని పడకల్ గ్రామంలో మహిళా గ్రామ సంఘం జనరల్ బాడీ సమావేశం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో పడకల్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ శాలువాతో ఘనంగా సన్మానించి గిఫ్ట్ను అందజేశారు. 2023 24 సంవత్సరాల గాను ఆర్థిక లావాదేవీలను కార్యదర్శి చదివి వినిపించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ కోఆర్డినేటర్ దశరథ్ మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమాలు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. బ్యాంకు రుణాలు శ్రీనిధి రుణాలు గ్రామ సంఘం రుణాలు చిన సంఘం రుణాలు వినియోగించుకొని అన్ని విధాలుగా వ్యాపార అభివృద్ధి చేసి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలని కోరారు. అనంతరం ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ను సన్మానించి పడకల్ గ్రామానికి మహిళా సంఘాల రుణాలు ఇచ్చినందుకుగాను సంతోషం వ్యక్తం చేసి బ్యాంక్ మేనేజర్ కు గిఫ్టును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం ప్రతినిధులు గ్రామంలోని అన్ని సంఘాల సభ్యులు వివోఏలు తదితరులు పాల్గొన్నారు.