నవతెలంగాణ – జుక్కల్
మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నాడు ఎంపిపి యశోదా అద్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ నరేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెలే తోట లక్ష్మీ కాంతారావ్ ముఖ్య అథితిగా పాల్గోన్నారు. ఈసంధర్భంగా శాఖల వారిగా గ్రామాల నిర్వహిస్తున్న పనుల వివిరాలను శాఖల వారిగా నిర్వహించారు. కొన్ని శాఖల వారు నివేదికలు ఇవ్వకపోవడంతో మండల విద్యాశాఖ అధికారీ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉపాద్యాయపలను డిప్యూటేషన్ పైన వెరో చోటికి , ఇతర మండలాలకు పంపుతున్నారని సబ్యులు ప్రశ్నించగా ఎమ్మెలే ఏంఈవో రాములు నాయక్ ను వివరణ కోరారు . సరియైన సమాదానం చెప్పక పోవడమే కాకా నివేదిక ఇవ్వక పోయిన అధికారుల పైన మేమో జారీ చేయాలని, శాఖ పరమైన చర్యలు చేరట్టాలని ఎంపిడివో నరేష్ కు ఇదేశించారు. విద్యుత్ శాఖ ఏఈ నివేదిక ఇవ్వక పోగా ప్రోగ్రాం లో సమస్యల పరిష్కారం పైన జవాబు చెప్పక పోవడం తాను కొత్తగా వచ్చానని ఏఈ ఎమ్మెలేకు తెలిపారు. జుక్కల్ నుండి బీదర్ కు బస్సు నడపాలని సబ్యులు ఎమ్మెలేను కోరారు. సెంట్రల్ లైటింగ్ పనులు ఇంకా ప్రారంబం కాలేదని ఎమ్మె లే దృష్టికి తీసుకోని వచ్చారు. సమస్యలను పరిష్కరిస్తానని సభకు ఎమ్మెలే హమీ ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం , సమయపాలన పాటీంచని అధికారులకు వెంటనె శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకుల మాట్లాడుతానని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉమాకాంత్, జెడ్పీటీసీ లక్ష్మీబాయి, ఎంపిడివో నరేష్, తహసీల్దార్ గంగాసాగర్, ఆర్ఐ రామ్ పటేల్, ఎంపివో యాదగిరి, విండో చైర్మేన్ శివానంద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గోన్నారు.