
నిజామాబాదు జిల్లా శాఖ రెడ్ క్రాస్ కార్యాలయం, రక్త నిది, తలసేమియా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.శ్రీరాములు మంగళవారం సందర్శించి పని తీరును తెలుసుకున్నారు. జిల్లా శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు కి కార్యవర్గానికి అభినందలు తెలుపుతూ కొన్ని సూచనలు తెలియజేసారు. జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ని ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు,కార్యదర్శి గోక అరుణ్ బాబు , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ , కోశాధికారి కరిపే రవీందర్ , నిజామాబాదు డివిజన్ చైర్మన్ డా.శ్రీశైలం, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అబ్బాపూర్ రవీందర్ ,బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ రాజేశ్వర్ ,పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.