ఉదారత చాటిన ఆదిలాబాద్ ఆటో డ్రైవర్

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఓ ఆటో డ్రైవర్ మానవత్వంతో ఉదారతను చాటుకున్నారు. వివరాలీల.. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన ఆటో డ్రైవర్ శివప్రసాద్ రాంపూర్ వద్ద మంగళవారం ఉదయం ఒక ప్రయాణికుడిని ఎక్కించుకొని పంజాబ్ చౌక్ లో దింపేశారు. అయితే ఆటోలో ప్రయాణికుడు సలీమ్ తన ఫోన్ మర్చిపోయాడు. కాసేపటికి సలీమ్ ఫోన్ రింగ్ అవ్వగా డ్రైవర్ చూసి స్పందించి సలీమ్ తో మాట్లాడారు. అనంతరం డ్రైవర్ ను సలీమ్ కలువగా ఫోన్ తిరిగి ఇచ్చేశారు. దింతో సలీమ్ సంతోషించి డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలిపారు.