నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలో జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ పిల్లలు విశ్వం అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారిచే నిర్వహించబడిన జిల్లాస్థాయి అబాకస్ పోటీలలో ఘన విజయం సాధించారు. ఇట్టి కార్యక్రమంలో ఇద్దరు జెంటిల్ కిడ్స్ విద్యార్థులను రాష్ట్రస్థాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. 2 ఫిబ్రవరి 2025 నాడు జరగబోయే రాష్టస్థాయి అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ పోటీలలో ఈ పిల్లలు పాల్గొంటారని ఇట్టి సందర్భంగా విశ్వం ఎడిటర్ అబాకస్ వేదిక మ్యాథ్స్ హైదరాబాద్ సంస్థ బుధవారం తెలిపారు.. జిల్లాస్థాయి లో గెలుపొందిన రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయిన పిల్లలందరికీ ప్రశంస పత్రాలు మెమెంటో లు గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండ్ గుజరాతి ప్రకాష్ ప్రిన్సిపల్ లత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రజిత తదితరులు పాల్గొన్నారు.