నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నాణ్యమైన ఆహార ఉత్పత్తే లక్ష్యంగా జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ (ముంబై) పనిచేస్తుందని ఆ సంస్థ సీఎమ్‌డీ వినోద్‌కుమార్ లాహౌటీ తెలిపారు. దేశంలో 22 శాఖలు, 3వేల మందికి పైగా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారనీ, 40 దేశాల్లో తమ సేవలు విస్తరించి ఉన్నాయని వివరించారు. భారత దేశంలో హరిత విప్లవం తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరిగిందనీ, కానీ ఆహార నాణ్యతా ప్రమాణాలు కోల్పోయామని ఆయన చెప్పారు. విషాహారం ప్రజలకు అందుతున్నదనీ, ఈ వ్యవస్థను పూర్తిగా మార్చి వేయడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. దానికోసం కొత్త టెక్నాలజీతో పంటల రోగనిరోధక శక్తిని పెంచి, పురుగుమందుల వాడకాన్ని నిరోధిస్తామన్నారు. దీనివల్ల రైతులు అధిక దిగుబడులతో ప్రయోజనం పొందుతారని తెలిపారు. సంస్థ నేషనల్ సేల్స్ మేనేజర్‌గా చక్రపు కిరణ్‌కుమార్, నేషనల్ మార్కెటింగ్ మేనేజర్‌గా అరుణ్‌కుమార్ రారు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిని యాజమాన్యంతో పాటు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.