ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరం 

Geriatric Medical Camp under AYUSH Departmentనవతెలంగాణ – కంఠేశ్వర్ 

ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిజామాబాద్ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని దుబ్బ ప్రాంతం లోని విద్యానగర్ కాలనీలో వృద్ధాప్య వైద్య శిబిరం స్థానిక కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్ జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి  వైద్య శిబిరం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ప్రవళిక శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ శిబిరాన్ని ప్రజలందరూ ఉపయోగించుకున్నారని ఆయుర్వేద మందులు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని, అన్ని రకాల వ్యాధులకు మందులు అందజేస్తారని తెలిపారు. జిల్లా ఆయుష్ ఇంచార్జ్ డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నాటి భారతీయ వైద్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య వైద్య శిబిరాన్ని నిర్వహించాలని దీర్ఘకాలిక వ్యాధులకు అన్ని రకాల వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని తెలిపారు. బిపి షుగర్ పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. ఆయుష్ కరపత్రాలను ఆరోగ్య కరదీపికలను అందరికీ అందజేశామని తెలియజేశారు. ఈ శిబిరంలో సుమారు 120 మందికి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపిఎమ్ ప్రేమలత, ఆయుష్ ఫార్మసిస్టులు వందనా రెడ్డి, పురుషోత్తం, వరలక్ష్మి, నీరజ, పారామెడికల్ సిబ్బంది రమేష్, బిక్షపతి, మనీష్, స్థానికులు శ్రీధర్, రాజేశ్వర్, శ్యామ్ రావు, శివ, గోపి, తదితరులు పాల్గొన్నారు.