181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సహాయాన్ని పొందండి.. 

నవతెలంగాణ – వీర్నపల్లి 
వీర్నపల్లి మండలం కేంద్రంలో మండల సమైక్య భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో మహిళలతో మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా సమావేశం నిర్వహించి మహిళలకు సంబంధించిన చట్టాలు గృహింస చట్టము, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నివారణ చట్టము, బాల్య వివాహ నిరోధక చట్టము, వంటి చట్టాల పైన అవగాహన కల్పించి అలాగే మహిళలు ఏవైనా ఇబ్బందులు గురైనప్పుడు వెంటనే వారికి 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సహాయాన్ని పొందవచ్చని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం నరసయ్య, ఎంపిటిసి అరుణ్ కుమార్, సీసీలు బాల రక్ష భవన్ సిబ్బంది విజయ, సఖి సిబ్బంది సంతోషి ,మహిళలు ఉన్నారు.