రుణమాఫీ చేస్తున్నాం హరీష్ రావు రాజీనామకు సిద్ధంగా ఉండు

– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
నవతెలంగాణ-తొగుట
రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడానికి క్యాబినెట్ తీర్మానం చేయడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరు కు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నివాసంలో  మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులకు తెలంగాణ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపు తున్నా మన్నారు. గతంలో సైతం రైతులకు ఒకే దఫాలో లక్ష రుణమాఫీ చేసిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీ కే ఉందని, పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వాయిదాల్లో రుణమాఫీ చేసినా పూర్తిగా రుణమాఫీ కాలేదని ఎద్దేవా చేశారు. లక్ష రుణ మాఫీ చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేతకాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్ష పాతి అని, రైతులకు మేలుచేయడానికి ప్రభు త్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. రూ. 31 వేల కోట్లతో ఏక కాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుం దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక టిగా అమలు చేస్తు, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 10 లక్షల ఉచిత ఆరోగ్య సేవలు, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అమలు చేయడం గర్వకారణం అన్నారు. ప్రజలకు  ఉపయోగపడే పథకాలు అమలు చేస్తుంటే ప్రతి పక్షాలు జీర్ణించుకోవడం లేదన్నారు. అనవసర విమర్శలు మానుకొని రైతులకు మంచి చేయడా నికి, ప్రభుత్వానికి సూచనలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. కమీషన్ల కోసం తెలంగాణ సంప దను దోచుకొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక విద్వంసం సృష్టించారని మండిపడ్డారు. వారు చేసిన పాపాలకు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణా రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం పూర్తి స్థాయిలో పని చేస్తున్నారని, త్వరలోనే మరిన్ని హామీలను సైతం నెరవేర్చి ప్రజ లకు ఇచ్చిన మాట నిలబెట్టుకొంటామని అన్నారు. ఈ సమావేశంలో దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), జిల్లా నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, చెగుంట మాజీ పిఏసిఎస్ చైర్మన్ వెంగళ్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకు లు సాబేర్, విజయ్ పాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.