మంచి ఉద్యోగాలలో స్థిరపడి తల్లిదండ్రులను బాగా సూసుకోవాలి

Get settled in good jobs and support your parents wellనవతెలంగాణ – పెద్దవూర
భవిష్యత్తు లో విద్యార్థులు మంచిఉద్యోగాలో స్థిరపడి తల్లిదండ్రులను బాగా సూసుకోవాలని సామాజిక కార్యకర్త సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో శ్రీ శారద సేవ ట్రస్ట్, మణికొండ, హైదరాబాద్ ,సేవా సంస్థ మేనేజింగ్ ట్రస్టు శారద అన్నారు. సోమవారం దామెర, నెవిళ్ల గూడెం, పెద్దాపురం, వడ్డేపల్లి గ్రామాలలోని పేద, ప్రతిభ గలిగిన విద్యార్థులకు సేవా ట్రస్టీలు దక్షిణామూర్తి త్యాగరాజు, శ్రీలక్ష్మి 1,20,000 విలువైన స్కూల్ బ్యాగ్స్ ,నోట్ బుక్స్, స్టేషనరీ వస్తువులు అందజేశారు.ఈసందర్బంగా సంస్థ మేనేజింగ్ ట్రస్ట్ శారద మాట్లాడుతూ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలు, పేద విద్యార్థులు, ప్రతిభగల విద్యార్థులకు సహకారం అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణ తో చదివి ఉత్తమ ఫలితాలు సాధించు కొని పాఠశాలకు, ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకరావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ శారద సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శారద, సంస్థ ట్రస్టీలు దక్షిణామూర్తి, త్యాగరాజు ,శ్రీలక్ష్మి , సేవా సంస్థ సభ్యులు సుభాష్ చంద్రబోస్, అప్పారావు , కళ్యాణ్ రామ్ ,ప్రసన్న రమణ, ఉపేంద్ర , మల్లేశ్వరరావు ,వెంకటేష్ సంతోషి ,ప్రమీల, ప్రభుత్వ ఉపాధ్యాయులు సామాజిక కార్యకర్త గురిజ, మహేష్,రమేష్, వట్టి కోటి చంద్రమౌళి, ప్రశాంత్, సత్యావతి, విద్యార్థుల తల్లిదండ్రులు , విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.