జిజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు ఫర్నిచర్ అందజేత

GG Foundation provides furniture to Traffic Police Stationనవతెలంగాణ –  ఆర్మూర్   

పట్టణంలోని జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అవసర నిమితం కావలసిన  ఫర్నిచర్ ఆఫీస్ టేబుల్,ఆఫీస్ వీల్ చెర్,విజిటర్స్ చెర్స్ లను ట్రాఫిక్ సిఐ వొడి రమేష్ కి  ప్రధానం చేయడం జరిగిందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. తమ ఆఫీస్ కొరకు  ఫర్నిచర్ అవసరం వుందని వారి దృష్టికి తేవడం జరిగింది. అందుకు వెంటనే స్పందించి కేవలం 4 రోజులలోనే ఇట్టి ఫర్నిచర్ పోలీస్ స్టేషన్ కు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగానే సామాజిక సేవలోఎల్లపుడూ నివేదన్ ముందు వరసలో వుంటాడని అభినందిస్తూ వారికి ధన్యవాదములు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డి జే దయానంద్, బొచ్కర్ వెను, జెస్సు ఆనంద్, బెల్డార్ శ్రీనివాస్,కాశినాథ్,గోపి ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.