జీజీహెచ్ డైట్ సప్లై టెండర్లు రద్దు చేయాలి

GGH diet supply tenders should be cancelledనవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డైట్ సప్లై టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని, ప్రజా పాలన రాష్ట్రంలో వచ్చింది కానీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇంకా రాలేదని డైట్ టెండర్ లో పాల్గొన్న టెండర్ దారులు అంబేద్కర్ ఎస్.సి. లెబోర్ కాంట్రాక్ కో-ఆప్ సొసైటీ లిమిటెడ్ అద్యక్షులు నాయుడు రాజు గారు మాల మహానాడు నాయకులు  ఆరోపణ చేశారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెండర్ నోటిఫికేషన్ కు ముందు నుండే కొందరు అధికారులు టెండర్ దారులతో కుమ్మక్కై గతంలో డైట్ సప్లై చేసిన వారికి టెండర్ ధక్కేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) టెండర్ దరఖాస్తు ఫారాలు పూర్తిగా ఎవరికి అర్థం కాని పద్ధతిలో పదజాలాన్ని సమకూర్చారని అదే టెండర్ దరఖాస్తు ఫారం వరంగల్ కు చెందినవి పూర్తి పదజాలం అర్థమయ్యే రీతిలో ఉందని, అంతేకాకుండా శుక్రవారం జరిగిన స్క్రుటిని లో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించిన అధికారులు స్క్రుటిని చేయకుండానే ఇతర ప్రాంతాలలో పనిచేసే అధికారులను స్క్రుటినీకి పిలిపించి టెండర్ లో పాల్గొన్న వారికి, మీరు సక్రమంగానే దరఖాస్తు చేసుకున్నారా జీఎస్టీ చెల్లింపు చేస్తున్నారా…, ఐటీ చెల్లిస్తున్నారా…, మీకు అనుభవం ఉందా.. ఆని అన్ని సక్రమంగా ఉన్నాయా అని పదేపదే ప్రశ్నించినప్పటికీ, గతంలో టెండర్ పొందిన వారికి మాత్రం, ఏమాత్రం ప్రశ్నించకుండానే అన్నియు సక్రమంగానే ఉన్నాయని తెలిపారని ఆరోపించారు. అంతేకాకుండా గతంలో డైట్ సప్లై చేసిన వారు పైన కొన్ని పత్రికలలో ఆరోపణలు ఉన్నాయి, అదేవిధంగా ఆసుపత్రికి వచ్చిన వారు పురుగుల ఆహారం తినలేమని సరైన నాణ్యంతలేని ఆహారాన్ని రోగులకు అందజేయడం వంటివి ఎన్నో చేశారని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆదికారులు పట్టించుకోకుండా,, వారికే టెండర్ దక్కేలా కొందరు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అని, ఇప్పటికైనా దీనిపైన జిల్లా కలెక్టర్ గారూ దృష్టి సారించి ఈ టెండర్లను పూర్తిగా రద్దుచేసి మళ్లీ కొత్త టెండర్లకు ఆహ్వానం పలకాలని కోరుతున్నాము అని అన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం మహిళా సంఘాలకే టెండర్లు ఇవ్వాలని ఆలోచన సచివాలయంలోనూ, కలెక్టరేట్ కార్యాలయంలోనూ క్యాంటీన్లను వారికి అప్ప చెప్పిన విధంగానే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కూడా వారికి అప్పచెప్పాలని అన్నారు. గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో వైద్య కళాశాలను, ప్రభుత్వ ఆసుపత్రిని ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయించారు, అంతే కాకుండా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గడ్ కూడా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని, ఆసుపత్రికి వచ్చిన వారికి అందించాలని అందులో ఎటువంటి అవకత అవకలు జరిగిన క్షమించమని, వారి పైన కఠిన మైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయుడు రాజు, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కిష్టయ్య, బీసీ నాయకులు దేవేందర్ యాదవ్,  కాంగ్రేస్ ఎస్టి సెల్ నగర అదక్షులు సుభాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.