మండలంలో ఘణంగా ఎల్ల అమావాస్య రైతుల పండుగ

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని గ్రామాలలో ఎల్లఅమావాస్య పండుగను రైతులు ఘణంగా గురువారం  నిర్వహించారు. ఈ సంధర్భమగా గ్రామాలలో రైతులు ప్రత్యేకంగా పంట పోలాలలో ఈ పండుగను నిర్వహిస్తారు. ఉదయం పంటపోలాలో తెల్లజొన్న సొప్ప బెండులతో గుడుసేను తయారుచేసి చుట్టరా కొత్త చీర, దోతి, గొంగడి కప్పి లోపల మట్టితో ఇంటిలో  నిత్య  ఉపయేాగించె సామగ్రిని  మట్టితో తయారు చేసి ఇంట్లో దేవతలను  పాడీ పశపవులను చేసి పండ్లు చెరుకు గడ, దొరికినవి పండ్లు , ఇంటివద్ద రుచికరమైన పల్లి రొట్టేలు, జొన్న అన్నం, పాయసం , జొన్న అంబలి, బజ్జీకూర స్పషల్ గా తయారు వంటకాలతో గుల్లను నింపుకుని అంబలి కడవతో నింపుకుని  పూజలు నైవేద్యం పెట్టి నిర్వహిస్తారు.బంధు మిత్రలుకు అహ్వనించి పిండి వంటలతో బోజనాలతో విందు అరగిస్తారు. పంటలు, పాడి పశువులు సంపద పెర్గాలని , సుఖ సంతోషాలతో మెుక్కులు దాన్యలక్ష్మీకి మెుక్కులు తీర్చుతారు.