ఘరానా బైక్ దొంగల అరెస్ట్

నవతెలంగాణ కంఠేశ్వర్:- నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్   సింగనవార్,  అడిషనల్ పోలీస్ కమిషనర్  జయరాం ఆదేశాల మేరకు  నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్ పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్  వారి సిబ్బంది నలుగురు బైక్ దొంగలను పట్టు అరెస్ట్ చేసికొని జైలుకు పంపించారు.  వివరాల్లోకి వెళితే మూడో పట్టణ ఎస్ఐ ప్రవీణ్ మరియు వారి సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు చంద్రశేఖర్ కాలనీ బైపాస్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు షేక్   మాజీద్,  మహమ్మద్ అమన్,  షేక్ సాజిద్ లు  రెండు ద్విచక్ర వాహనాలను వదిలి పారిపోతుండగా ఎస్సై మరియు వారి సిబ్బంది వెంబడించి వారిని పట్టుకుని  విచారించగా మొత్తం తొమ్మిది ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి  వాటిని షేక్ ఫైజల్లా అను జల్లపల్లికి చెందిన వ్యక్తికి నాలుగు ద్విచక్ర వాహనాలు,  మరియు ధర్మాబాద్ ,  మరియు బైంసాకు చెందిన వ్యక్తులకు  అమ్మినారు.  జల్సాలకు అలవాటు పడి ఏదైనా దొంగతనాలు చేసి డబ్బులు సంబంధించి జల్సా లకు వాడుకుందామని ఉద్దేశంతో పై ముగ్గురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి నిజాంబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నిలిపించినటువంటి ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని కోటగిరి మహారాష్ట్రలోని ధర్మాబాద్ మరియు ఇతర ప్రాంతాలలో తీసుకొని వెళ్లి అమ్మి వాటి ద్వారా వచ్చే సొమ్మును వారి జల్సాల కోసం వినియోగించేవారు.   అట్టి ముగ్గురు వ్యక్తులను పోలీస్ వారు వారితో చేసి వారి వద్ద  కొన్న షేక్ సైజుల్ల అనే కోటగిరికి చెందిన వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి మొత్తం ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం పరుచుకుని కోర్టు యందు హాజరు పరిచారు.  ద్విచక్ర వాహన దొంగలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన మూడో పట్టణ ఎస్సై ప్రవీణ్ మరియు వారి సిబ్బంది  షౌకత్ ఆలీ,  చామీoద్,  అప్సర్ లను నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్ అభినందించారు.