పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఘటాడి భాస్కర్

– రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కె.రాజేంధర్ ఎన్నిక.
నవతెలంగాణ-ఏర్గట్ల
పీఆర్టీయూ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమ్మేళన కార్యక్రమంలో తాళ్ళ రాంపూర్ పాఠశాలకు చెందిన ఘటాడి భాస్కర్ ను రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా,ఏర్గట్ల పాఠశాలలో పనిచేస్తున్న కే. రాజేంధర్ ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు  పి.మోహన్ రెడ్డి , జి.కిషన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్గట్ల పీఆర్టీయూ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కృష్ణ ప్రసాద్ , రాజశేఖర్ లు నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.