– నేడు కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటన
నవతెలంగాణ-ఓయూ
జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి, బీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌రెడ్డి శనివారం బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగేండ్ల నుంచి పార్టీలో పనిచేశామని, ఉద్యమకారులకు బీఆర్‌ఎస్ పార్టీలో మనుగడ కరువైందని లేఖలో పేర్కొన్నట్టు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిపారు.