
జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి బహుళ అంతస్తును నిర్మించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు బేగంబజార్ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను గోషామహల్ సర్కిల్ -14 టౌన్ ప్లానింగ్ ఏసీపీ సైదుద్దీన్, సెక్షన్ అధికారి ముఖేష్ సింగ్, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి 6గంటల పాటు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..శంకర్ బాగ్ లో జస్ రాజ్ జైన్ కు 42గజాల జాగా.. ఇంటి నేం. 5-3-1004, 06 స్థలంలో జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం జీ+2 అనుమతి ఉన్నది.. కానీ జస్ రాజ్ జైన్ జీహెచ్ఎంసీ నిబంధలను తుంగలో తొక్కి జీ+5, పెంటా హౌస్ అక్రమ నిర్మాణం చెప్పటారు. కాగా సమీప ఇంటి నిర్వాహకుడు మొహమ్మద్ సల్మాన్,జస్ రాజ్ జైన్ నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులను నిర్మాణం చేపడుతున్నాడని అంతేకాకుండా తమ ఇంటి వైపు ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా వెంటిలేషన్ కిటికీలను ఏర్పాటు చేయడంతో గోషామహల్ జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశాం. వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశారు.దీంతో హైకోర్టు విచారణ చేపట్టి వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తరువాత హైకోర్టు అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేయాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్ఎంసి అధికారులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తర్వాత కూల్చి వేస్తామని చెప్పారు. తిరిగి బాధితుడు మహమ్మద్ సల్మాన్ కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలతో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చారు.. దీంతో టౌన్ ప్లానింగ్ ఏసిపి సయిద్ ఉద్దిన్, సెక్షన్ అధికారి ముఖేష్ సింగ్, జీహెచ్ఎంసీ సిబ్బంది,బేగంబజార్ పోలీసులతో కలిసి అక్రమ కట్టడాలను కూల్చివేశారు.. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు.