హైదరాబాద్‌లో జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా విస్తరణ

హైదరాబాద్‌ : నగర మార్కెట్‌పై జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా దృష్టి సారించినట్టు వెల్లడించింది. ఇందుకోసం హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. ఇటీవల తుక్కుగూడలోని అల్మాస్‌గూడలో ప్రత్యేకమైన స్మార్ట్‌ విల్లా గేటెడ్‌ కమ్యూనిటీ కోసం జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌ స్మార్ట్‌ హోమ్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుందని పేర్కొంది. ఫేజ్‌-2లో కొత్త టవర్‌ను ప్రారంభిస్తున్నామని జిహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా సిఇఒ కార్తీష్‌ రెడ్డి మాడ్గుల తెలిపారు. తమ ఖాతాదారులకు రాజీలేని, విలాసవంతమైన జీవనశైలినీ అందించడానికి రూపొందించబడ్డాయన్నారు. ఫేజ్‌-1 ప్రాజెక్ట్‌ డిసెంబర్‌ 2025 నాటికి పూర్తి కావడానికి తగిన మార్గంలో ఉందన్నారు.