ఐఎంజీసీతో జీఐసీ హౌసింగ్‌ హెచ్‌ఎఫ్‌ఎల్‌ ఒప్పందం

న్యూఢిల్లీ: తనఖా గ్యారెంటీ సంస్థ అయిన ఇండియా మార్ట్‌గేజ్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (ఐఎంజీసీ) గృహ రుణ ఉత్పత్తులను అందించడానికి ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలలో ఒకటైన జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (జీఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌)తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా గృహ ఫైనాన్స్‌ రంగంలో అవకాశాలు, స్థోమతను పెంచడానికి ప్రత్యేకంగా రూపొందించబడిందని ఐఎంజీసీ చీఫ్‌ అలయన్స్‌ ఆఫీసర్‌ అకృతి సింగ్‌ తెలిపారు. వినూత్న తనఖా హామీ పరిష్కారాలను తీసుకురావడానికి జీఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌తో భాగస్వామ్యం చేసుకోవటానికి తాము సంతోషిస్తున్నామన్నారు.