పాఠశాలకు 70 వేల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల బహుకరణ

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి పాఠశాలకు రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో భాగంగా రాంచర్ల శ్రీకాంత్ మాధవి దంపతులు శనివారం 70,000 విలువచేసి ప్రొజెక్టర్ స్క్రీన్నర్ ఆడియో సిస్టం రూటర్ మరియు 45 డిక్షనరీ  బహుకరించడం జరిగింది. హనుమకొండ జిల్లా నడి కూడా మండలం రాయపర్తి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి శ్రీకాంత్  ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ పాఠశాలలకు సహాయం చేయాలని ఆలోచనతో ఏటూర్ నాగారం మండలంలోని నార్త్ ప్రాథమిక పాఠశాలకు మరియు గోవిందపేట మండలంలోని చల్వాయి ప్రాథమిక పాఠశాలలకు లక్ష 20వేల రూపాయలు ఖరీదు కలిగినటువంటి కంప్యూటర్ కు సంబంధించిన వస్తువులు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ గోవిందరావుపేట అధ్యక్షులు సూడి శ్రీనివాస్ రెడ్డి  ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం అవసరమని ఈ సందర్భంగా ఆ దంపతులను అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి  కాటన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ వాసుదేవరెడ్డి సర్పంచ్ చల్వాయి ఈసం సమ్మయ్య  ఉపసర్పంచ్ ప్రసాద్  విద్యా కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు  ఉపాధ్యాయులు శ్యాంసుందర్ రెడ్డి శ్రీనివాస్ దీప్తి మేడం శ్రీదేవి మాధవి లత రమేష్ మల్లారెడ్డి దిలీప్ కుమార్ శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.