
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ హై స్కూల్ కి రూ. 20 వేల విలువ గల వాటర్ ఫ్యూరిఫైయర్ ను గురువారం తీపి రెడ్డి స్వాతి రవీందర్ రెడ్డి దంపతులు అందజేశారు. శుక్రవారం తన 40వ పుట్టిన రోజు సందర్బంగా పాఠశాలకు వాటర్ ఫ్యూరిఫైయర్ బహుకరించడం చాలా సంతోషకరంగా ఉందని తీపి రెడ్డి స్వాతి అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెంటయ్య వారికి విద్యార్థుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు ముందస్తుగా డోనర్ స్వాతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తీపి రెడ్డి విజయ రంగారెడ్డి, భూపతి రెడ్డి దంపతులు , టీఈఎఫ్ తీపి రెడ్డి మల్లారెడ్డి, పాఠశాల యాజమాన్యం ఉన్నారు.