“బహుమతి “కథల పుస్తకం ఆవిష్కరణ…

నవతెలంగాణ – చండూరు  
పిల్లల  సర్వతో ముఖాభివృద్ధికి కథలు ఎంతగానో దోహదం  చేస్తాయని ప్రముఖ రచయిత్రి ముంజలూరి కృష్ణకుమారి అన్నారు. గురువారం హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన బాల సాహిత్య సదస్సులో పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చండూరు జిల్లా పరిషత్ ఉన్నత   పాఠశాలలో పనిచేస్తున్న  ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన “బహుమతి ” పిల్లల  పుస్తకం లో ఎన్నో మంచి కథలు ఉన్నాయని ప్రతి కథ నైతిక విలువలు పెంపొందించే విధంగా పిల్లలకు ఉపయోగపడతాయని  అన్నారు. ఈ కార్యక్రమంలో సారస్వత  పరిషత్ ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య, చొక్కాపు వెంకటరమణ, గంగిశెట్టి శివకుమార్, పుప్పాల కృష్ణమూర్తి, పైడిమరి రామకృష్ణ, లలితా దేవి, అమరవాది నీరజ, గరిపల్లి అశోక్, ఉండ్రాల రాజేశం, వడ్డేపల్లి వెంకటేష్, సాగర్ల సత్తయ్య, బివి స్వామి, రామకృష్ణ, జానకిరామ్  తదితరులు పాల్గొన్నారు.