నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని ఉట్లపల్లి ప్రాధమికోన్నత పాఠశాలలో ఘణతంత్ర దినోత్సవం సందర్బంగా గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోడిమ సుధాకర్ రెడ్డీ 4000 రూపాయలతో ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బాహుమతులు సోమవారం వితరణ చేశారు. ఈసందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షపతి మాట్లాడుతూ దాతల సహాయం మరువ లేనిదని అన్నారు. పాఠశాల అభివృద్ధిలో దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది దాత తోడిమ సుధాకర్ రెడ్డీ ని ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపేంద్రమ్మ, నాగిరెడ్డి, రామలింగయ్య, కరుణాకర్ రెడ్డీ, కాంగ్రెస్ నాయకులు బీరెడ్డి బాల్ రెడ్డీ, వాసుదేవుల రవీందర్ రెడ్డీ, తోడిమ వల్లపు రెడ్డీ, గ్రామస్తులు పాల్గొన్నారు.