జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన అడ్వాల రాజేశ్వరి తండ్రి రాజన్న, వయస్సు: 16 సంవత్సరాలు అను బాలిక తేది: 22.12.2023 అందజ ఉదయం 07:15 గంటల సమయంలో గ్రామంలోని టేలర్ షాప్ వరకు పోయి వస్తా అని ఇంట్లో వారికీ తెలిపి బయటకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని, చుట్టు పక్కల వెతికినా ఆమె ఆచూకి తెలియడం లేదని అంతే గాక ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉందని ఆమె తల్లి పద్మ ఇచ్చిన పిర్యాదు మేరకు జక్రంపల్లీ పోలీస్ స్టేషన్ యందు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంబించనైనదని ఎస్సై తిరుపతి తెలిపారు. ఆమె గురించి ఏమైనా వివరాలు తెలిసినచో 8712659853 ఎస్సై జాక్రన్ పల్లి కి తెలుపగలరని తెలియజేశారు.