బాలికలు అన్ని రంగాలలో అద్భుతంగా రాణిస్తున్నారు

– గొంది దివాకర్ మండల విద్యాధికారి
నవతెలంగాణ – గోవిందరావుపేట
నేడు ప్రపంచవ్యాప్తంగా బాలికలు అన్ని రంగాలలో అద్భుతంగా ప్రతిభను కనబరిస్తూ రాణిస్తున్నారని మండల విద్యాధికారి గొంది దివాకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల (బాలికలు) లో  జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాధికారి గొంది దివాకర్ మాట్లాడుతూ నేడు ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందనీ వారు రాణించే ప్రతి అంశాలలో వారికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. పాఠశాలల్లో నేడు బాలికలకు మార్షల్ ఆర్ట్ నేర్పిస్తున్నారు.  అలాగే ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు మండలంలోని అన్ని పాఠశాలల్లో బాలికలకు కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ లు బద్దం సుదర్శన్ రెడ్డి, ఆర్షం రాజు లు మాట్లాడుతూ నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికల సాధికారికత బాలికల వివాహ వయస్సు బాలికల రాణింపు గురించి మాట్లాడారు. నేడు ప్రభుత్వం బాలికలకు అన్ని రంగాలలో అవకాశం కల్పిస్తుంది. వాటిని అందిపుచ్చుకోవడం బాలికల యొక్క కర్తవ్యం. పేరెంట్స్ కూడా బాలికల పట్ల అన్ని విషయాలు అవగాహన చేసుకుని వారికి ఉన్నత చదువును అందించడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం వారు జిల్లాలో బాలికా సాధికారికత పైన అనేక కార్యక్రమాలను ఏటా  ఏర్పాటు చేయడం జరుగుతుందనీ ,సమాజంలో ఇంకా లింగ వివక్షత కనిపిస్తూనే ఉంది బాలికలంటే చిన్నచూపు చూసే తల్లిదండ్రులు లేకపోలేదు. ఆడపిల్ల ఆడపిల్లే కదా కొంత చదివినా చదవకపోయినా ఏదో ఒక రోజు పెళ్లి చేస్తే అత్తవారింటికి వెళ్లిపోవడమే అందుకు డబ్బు పెట్టుబడి పెట్టి బాలికలను చదివించడం ఎందుకు అని కొంతమంది  అనుకొని ఉండవచ్చు కానీ నేడు బాలికలు ఎంతో ఉన్నత స్థానంలో ఎదిగిన వారు ఉన్నారు ఒకానొక దినములో ప్రధాన మంత్రిగానూ రాష్ట్ర గవర్నర్లుగాను రాష్ట్రపతిగాను ఐఏఎస్ ఆఫీసర్లుగాను అలాగే నేవీ ఆఫీసర్లుగాను ప్రజా ప్రతినిధులుగాను నేడు ఎంతో మంది రాణిస్తు ఉన్నారు వారి జీవితాలను మార్గదర్శకంగా తీసుకొని ఆడపిల్లలు ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేయడం మానుకోవాలి అది చట్టరీత్యా నేరం. అమ్మాయి లకు 18 సంవత్సరాలు వయస్సు పైబడిన తర్వాత అబ్బాయిలకు 21 సంవత్సరాలు వయస్సు పైబడిన తర్వాత మాత్రమే వివాహం చేయాలి అంతేగాని చిన్న వయసులో వివాహాలు జరపకూడదు బాలికలకు ఉన్న అవకాశాలను అందరు కూడా తెలుసుకొని వారికి తెలియజేయవలసిన అవసరం కూడా ఎంతో ఉంది బాలికలు ఎదగడమే రేపటి సమాజానికి మంచి పునాది భవిష్యత్తు కూడా ఉంటుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు చేశారు ఈ సమావేశంలో బాలికల పాఠశాల ఉపాధ్యాయులు అన్న మేరి. వనజ. పద్మజ. అంజలి. రేణుక. అనిత భాయ్. రాజు ఎమ్మార్సీ సిబ్బంది విష్ణు సి ఆర్ పి లు గ్రామపంచాయతీ కార్య దర్శి మరియు సిబ్బంది  పాల్గొన్నారు.