– థాయ్ లాండ్‌పై 13-0తో ఏకపక్ష విజయం
– మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ
పట్నా (బిహార్) : ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ హాకీ ఇండియా తీన్‌మార్ మోగించింది. వరుసగా మూడో విజయం సాధించిన భారత మహిళలు.. అజేయ జైత్రయాత్ర కొనసాగించారు. గురువారం రాజగిరి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో థాయ్ లాండ్‌పై గోల్స్ వర్షం కురిపించారు. దీపిక ఐదు గోల్స్‌తో మెరువగా.. భారత్ 13-0తో థారులాండ్‌పై ఏకపక్ష విజయం సాధించింది. తొలి క్వార్టర్‌లో 3-0, రెండో క్వార్టర్‌లో 5-0, మూడో క్వార్టర్‌లో 9-0తో ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లిన టీమ్ ఇండియా టోర్నీలో హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. భారత్ తర్వాతి మ్యాచ్‌లో చైనాతో తలపడనుంది. చైనా సైతం మూడు మ్యాచుల్లో గెలుపొంది అజేయంగా నిలిచింది.