– సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై గెలుపు
– ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్
కౌలాలంపూర్ : టీమ్ ఇండియా అమ్మాయిలకు ఎదురు లేదు. వరుసగా ఏకపక్ష విజయాలతో దూసుకెళ్తోన్న భారత మహిళల అండర్-19 జట్టు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ అమ్మాయిలపై మనోళ్లు 9 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించారు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా అమ్మాయిలతో తాడోపేడో తేల్చుకోనున్నారు. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 113/8 పరుగులు చేసింది. బౌలర్లు వైష్ణవి శర్మ (3/23), పారునిక శిసోడియ (3/21), ఆయుశి శుక్లా (2/21) రాణించారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డావిన పెరిన్ (45, 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఏబి (30, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మెరవటంతో ఆ జట్టు గౌరవప్రద స్కోరు సాధించింది. ఛేదనలో తెలుగమ్మాయి గొంగడి త్రిష (35, 29 బంతుల్లో 5 ఫోర్లు) సహా కమలిని (56 నాటౌట్, 50 బంతుల్లో 8 ఫోర్లు), సానిక (11 నాటౌట్) అదరగొట్టారు. 15 ఓవర్లలో 117/1తో మరో 30 బంతులు ఉండగానే లాంఛనం ముగించారు. మూడు వికెట్లతో మెరిసిన సిసోడియ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.