
ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నుండి తమని తాము రక్షించుకోవడానికి ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఎంతో అవసరమని డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. శనివారం వాంకన్ కరాటే డు ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుండి భిక్కనూరు మండలంలో ట్రైన్ ద ట్రైనర్స్ ప్రాజెక్టులో భాగంగా ఆడ పిల్లలకు ఉచితంగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం అభినందనీయమని, ప్రాజెక్టుకు స్పందిస్తూ 5 వేల రూపాయల విరాళాన్ని కరాటే నిర్వాహకులు ఎన్జీవో సెక్రటరీ ప్రియాంక, స్వాతిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే నిర్వాహకులు శ్రీకాంత్, ప్రశాంత్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.